వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 61,528 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
కమల్ హాసన్ (జ.నవంబర్ 7, 1954) భారతదేశ జాతీయ నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. ఈయన శ్రీనివాసన్, రాజ్యలక్ష్మి దంపతులకు నాలుగో సంతానం మరియు ఆఖరి వాడు. కొడుకులందరికి చివరి పదం "హాసన్" అని వచ్చేలా పేరు పెట్టారు ఈ దంపతులు. ఇది హాసన్ అనబడే ఒక మిత్రుడితో తమకి ఉన్న అనుబంధానికి గుర్తు. కమల్ 6 యేళ్ళ పసి వయసులోనే చిత్ర రంగంలోకి ప్రవేశించాడు. ఆయన మొదటి చిత్రం "కలత్తూర్ కన్నమ్మ". బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలను అభ్యసించాడు. నూనూగు మీసాల వయసులో సినిమాలలో నృత్య దర్శకుడిగా పని చేసాడు. అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె.బాలచందర్ తో ఆయనకు ఏర్పడిన అనుబంధం తరువాత సుదీర్ఘ గురు-శిష్య సంబంధంగా మారింది. కమల్ నేపథ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందాడు. ఇటీవలి కొన్ని చిత్రాలలో పాటల రచయితగా కూడా పని చేసాడు. భరత నాట్యం ప్రదర్శించటంలో ఆయనకి ఆయనే సాటి. తమిళ చిత్ర రంగంలో తిరుగులేని నటుడిగా ఎదిగాడు. కమల్ తన సినీ జీవితాన్ని "కలత్తూర్ కన్నమ్మ" అనే చిత్రంలో బాల నటుడిగా ఆరంభించాడు. ఇది ఆయనకి ఉత్తమ బాల నటుడిగా అవార్డ్ తెచ్చిపెట్టిన మొదటి చిత్రం.
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకరమనిపించినట్లయితే, దయచేసి సర్వర్ సామగ్రి కొనుగోలు చేయుటకు మరియు వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికి ఉపయోగిస్తారు.